Aanandhinthu neelo deva anudhinam ninu ఆనందింతు నీలో దేవా అనుదినం నిను స్తుతించుచు

Song no: 67

    ఆనందింతు నీలో దేవా
    అనుదినం నిను స్తుతించుచు (2)
    మధురమైన నీ నామమునే (2)
    మరువక ధ్యానించెద ప్రభువా || ఆనందింతు ||

  1. ఆత్మ నాథా అదృశ్య దేవా
    అఖిల చరాలకు ఆధారుండా (2)
    అనయము నిను మది కొనియాడుచునే
    ఆనందింతు ఆశ తీర (2) || ఆనందింతు ||

  2. నాదు జనములు నను విడచినను
    నన్ను నీవు విడువకుండా (2)
    నీ కను దృష్టి నాపై నుంచి
    నాకు రక్షణ శృంగమైన (2) || ఆనందింతు ||

  3. శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు
    మేఘమందు రానైయున్న (2)
    ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు
    అంతం వరకును భద్రపరచుము (2) || ఆనందింతు ||

  4. శ్రమలు నన్ను చుట్టిన వేళ
    చింతలో కృశించిన వేళ (2)
    అభయముగా నీ దర్శనమిచ్చి
    శ్రమలు బాపి శాంతినిచ్చితివి (2) || ఆనందింతు ||
Blogger ఆధారితం.