Sarirarevvaru naa priyudaina yesayyaku సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు

Song no: 98

    సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2
    సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
    సరిహద్దులు లేని పరిశుద్ధునికి -2
    సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2

  1. నమ్మదగిన వాడే నలుదిశల నెమ్మది కలుగజేయువాడే -2
    నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే
    నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే -2 || సరిరారెవ్వరూ ||

  2. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే -2
    ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే
    నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే -2 || సరిరారెవ్వరూ ||

  3. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే -2
    శ్రేష్ఠమైన పునరుత్థాన బలము యిచ్చినాడే
    నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే -2 || సరిరారెవ్వరూ ||



Blogger ఆధారితం.