Prabhuva neeo jeevinchuta ప్రభువా నీలో జీవించుట

Song no: 20

    ప్రభువా నీలో జీవించుట -2
    కృపాబాహుళ్యమే నా యెడ - కృపాబాహుళ్యమే -2
    ప్రభువా నీలో జీవించుట

  1. సంగీతములాయే - పెను తుఫానులన్నియు -2
    సమసిపోవునే - నీ నామ స్మరణలో -2
    సంతసమొందే - నా మది యెంతో -2                        
    ప్రభువా నీలో జీవించుట.....

  2. పాప నియమమును - బహు దూరముగా చేసి -2
    పావన ఆత్మతో - పరిపూర్ణమై -2
    పాదపద్మము - హత్తుకొనెదను -2  
    ప్రభువా నీలో జీవించుట.....

  3. నీలో దాగినది - కృప సర్వోన్నతముగా -2
    నీలో నిలచి - కృపలనుభవించి -2
    నీతోనే యుగ - యుగములు నిల్చెద -2
    ప్రభువా నీలో జీవించుట.....

  4. నూతన వధువునై -శుద్ధ వస్త్రములు ధరించి -2
    నూతనమైన - శుభకాంక్షలతో -2
    నూతన షాలేమై - సిద్ధమౌదు నీకై -2

    ప్రభువా నీలో జీవించుట-2
    కృపాబాహుళ్యమే నా యెడ - కృపాబాహుళ్యమే -2
    ప్రభువా నీలో జీవించుట .....
        
Blogger ఆధారితం.